- Advertisement -
హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలిపై రేప్ కేసు నమోదయింది. తనపై సామూహిక లైంగికదాడి చేశారంటూ ఢిల్లీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తన యజమాని, స్నేహితురాలితో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీకి వచ్చినప్పుడు బలాత్కారం చేశారని వెల్లడించింది.
2023, జూలై 3న నిందితులిద్దరు తమకు కలిశారు. బడోలి తనను తాను ఓ సీనియర్ రాజకీయ నాయకుడినని, తాను సింగర్‌ను అంటూ రాకీ పరిచయం చేసుకుని ప్రలోభ పెట్టారన్నారు.
అనంతరం తమకు బలవంతంగా మద్యం తాగించారు. నా స్నేహితురాలిని బెదిరించి పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాపై ఇద్దరూ కలిసి లైంగికదాడికి పాల్పడ్డారు. నా నగ్న చిత్రాలు, వీడియోలు తీశారు. దానిని చూపించి ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారంటూ తెలిపారు.
Also Read:సంతాన ప్రాప్తిరస్తు…స్పెషల్ పోస్టర్
- Advertisement -