బాలీవుడ్‌లో ఖాన్ త్రయంతో పోటీపడి నటిస్తున్న హీరో రన్ వీర్ సింగ్. అనతికాలంలోనే స్టార్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. డిఫరెంట్ కంథాంశాలతో,,అంతకు మించిన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. రామ్ లీలా,,భాజీరావ్ మస్తాని వంటి హిస్టారికల్ మూవీలతో ఫుల్ పాపులర్ అయిన రన్‌వీర్,,,,సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మరో చారిత్రాత్మక సినిమాకు సిద్దమైయ్యాడు. పద్మావతి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో,,,అల్లాఉద్దిన్ ఖిల్జీగా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. పద్మావతిగా దీపిక పదుకోన్ లీడ్ క్యారెక్టర్ లో కన్పించనుంది. ఇందులో రన్‌వీర్‌కు జోడిగా,, రాణిపాత్రలో ఎవరు నటిస్తారో అని ఇన్ని రోజులు అసక్తి నెలకొంది. ఈ ఎదురుచూపులకు చెక్ పెడుతు దర్శకుడు భన్సాలీ,,,రన్‌వీర్‌కు సరైన జోడి ఎంపిక చేశాడు. పలు బాలీవుడ్ సినిమాలతో మెప్పించిన,,హాట్ బ్యూటీ అతిథి రావు హైదరిని రన్‌వీర్‌కు జంటగా సెలక్ట్ చేశాడు.
పద్మావతి సినిమాలో రన్‌వీర్ సింగ్ కు జోడిగా అతిథి రావ్ హైదరిని దర్శకుడు భన్సాలీ సెలక్ట్ చేసుకోవాడానికి ఓ కారణం ఉందట. అలనాటి నటి,,అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్,,కోరిక మేరకు అమ్మడుకు ఇందులో నటించే అవకాశం కల్పించాడట. అదితి కళ్లు, ముఖ వర్ఛస్సు బాగుంటుందని..భన్సాలీ తెరకెక్కిస్తున్నపద్మావతి చరిత్రాత్మక చిత్రం కాబట్టి అదితి రాణి పాత్రలో చక్కగా సరిపోతుందని జయా తన స్నేహితురాలితో అన్నారట. స్నేహితులురాలు ఈ విషయాన్నిభన్సాలీ చెవిన వేసింది. జయా మాటను గౌరవించి భన్సాలీ వెంటనే అదితికి.. రణ్‌వీర్ సింగ్ భార్య పాత్రలో అవకాశమిచ్చారట. అల్లావుద్దీన్ ఖిల్జి.. ఆయన ప్రేయసి రాణి పద్మావతి జీవితం ఆ ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఖిల్జి పాత్రలో రణ్‌వీర్.. పద్మావతి పాత్రలో దీపిక, పద్మావతి భర్త రాజా రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. 2017 డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.