ఈ టార్చర్ భరించలేను

237
Rangula Raatnam Trailer
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా శ్రీరంజని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగులరాట్నం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రాజ్‌తరుణ్‌ ప్రేమ కష్టాలను చూపించారు. భావోద్వేగాలతోపాటు వినోదం కలగలిపి రూపొందించిన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది.

ప్రేమ పేరుతో నువ్వు పెట్టే ఈ టార్చర్‌ నేను భరించలేను అంటూనే తన ప్రేయసి చుట్టూ తిరుగుతున్నారు రాజ్‌తరుణ్‌. ఆమె కోసం తనకు ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టమైన పనులకు దూరంగా ఉంటూ అనేక కష్టాలు పడుతున్నారు.

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో రాజ్ త‌రుణ్‌కి తొలి అవ‌కాశం ఇచ్చిన అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మించ‌డం విశేషం.రాజ్ త‌రుణ్ కెరీర్ గ్రాఫ్ బాగుండ‌డం, ఈ హీరో సినిమా మినిమం హిట్ అవుతుంద‌నే టాక్ ఆడియ‌న్స్‌లో ఉండ‌డంతో పాటుగా అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించ‌డంతో రంగుల రాట్నంపై కూడా ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగాయి.

- Advertisement -