మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వైజాగ్‌లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. పల్లెటూరి నేపధ్యంలో సినిమా ఉంటుందనే క్లారిటీ ముందు నుంచి ఉంది కానీ కథ గురించి మాత్రం ఎక్కువ క్లూ ఇవ్వకుండా ఇప్పటిదాకా జాగ్రత్త పడ్డారు చిత్ర బృంద. ఇప్పుడు వదిలిన ఈ ట్రైలర్‌లో అసలు కథ ఏంటి అనేది స్పష్టంగా చెప్పేశారు.
రామ్ చరణ్ గురించి ఏదైతే ఫాన్స్ ఆశిస్తున్నారో అవన్నీ పక్కా లెక్కలు తూచి మరీ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని తీర్చిదిద్దినట్టు ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది. ముందు సరదాగా తిరిగే పాత్రలా చూపించి అన్నయ్య కోసం దేనికైనా తెగించే వాడిగా రెండు షేడ్స్ ని అద్భుతంగా పలికించాడు చరణ్. ఇక అమాయకురాలైన రామ లక్ష్మిగా సమంతా చాలా కొత్తగా ఉంది. ముందు నుంచి ఉన్న అంచనాల మేరకు ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
దేవి శ్రీ ప్రసాద్ థీమ్ మ్యూజిక్ – బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన వాటర్ ఫైట్ చేజ్ ఇవన్ని ట్రైలర్ లో అలా అలా చూపించి ఫాన్స్ మరో పన్నెండు రోజుల దాకా సినిమా కోసం ఆగడం కష్టమే అనిపించేలా చేసారు. మార్చి 30న రంగస్థలం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.