‘రంగస్థలం’లో సౌండ్‌ ఇంజనీరుగా రామ్‌చరణ్‌ ..

286
Rangasthalam Movie Teaser
- Advertisement -

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌లో చరణ్‌ పలికే డైలాగ్స్‌ కొత్తగా అనిపించాయి. ‘‘నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్‌ ఇంజనీరు’ అంటారు’’ అని అంటున్నారు రామ్‌చరణ్‌.

Rangasthalam Movie Teaser

అయిత ఇందులో చరణ్‌ గత అన్ని సినిమాలకంటే భిన్నంగా కనిపించారు. ఆయన డైలాగ్‌ డెలివరీ కూడా కొత్తగా అనిపించింది. గోదావరి యాసలో చరణ్‌ డైలాగ్‌లు పలికారు. ఈ టీజర్‌ నేపథ్యంలో ‘రంగ.. రంగ.. రంగస్థలాన’ అని వచ్చిన పాట హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చరణ్‌ మూగ, చెవిటి వ్యక్తిగా కనిపిస్తాడని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచార చిత్రంలో చిట్టిబాబుగా తనకు వినపడదని మాత్రమే రామ్‌చరణ్‌ చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తో్ంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 1985 నాటి కాలాన్ని తలపిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.5 కోట్లతో పెద్ద సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్‌ జరుగుతోన్నట్లు సమాచారం. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -