2018లో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమాలు రంగస్థలం,మహానటి. తెలుగు సినిమాల రికార్డులను తిరగరాసిని ఈ రెండు సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో 2018 టాప్ 10 మూవీల్లో చోటుసంపాదించుకున్నాయి.
సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్ , తదితర వర్గాలకి సంబంధించిన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్ ) 2018కి గాను ఇండియాలో టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది . అంధాదన్ టాప్ వన్ స్ధానాన్ని దక్కించుకోగా సంజు మూవీ 10వ స్థానంలో నిలిచింది.
ఇక టాలీవుడ్ నుండి మహానటి (4), రంగస్థలం(7) స్థానాల్లో చోటు సంపాందించాయి. మహానటి చిత్రం అభినవ నేత్రి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కగా ఇందులో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు ఆల్‌టైమ్ సినిమాల జాబితాలో చోటుదక్కించుకుంది.
ఇక లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం . రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.
ఐఎండిబి 2018 టాప్ 10 చిత్రాలు :
1. అంధాదున్ (హిందీ )
2. రట్సాసన్ (తమిళం )
3. 96 (తమిళం )
4. మహానటి (తెలుగు)
5. బడాయి హో (హిందీ)
6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)
7. రంగస్థలం (తెలుగు)
8. స్ట్రీ (హిందీ)
9. రాజీ (హిందీ)
10. సంజు (హిందీ)