అవును… శుక్రవారం రిలీజ్ కాబోయే రంగస్థలం మూవీలో ఏదో ఉంటుందనుకొని, అది లేకపోయేసరికి అప్సెట్ అవడంలాంటివి చెయ్యకండి. మీరు రంగస్థలం సినిమాకి వెళ్ళాలంటే.. కేవలం తెల్ల పేపర్ లా వెళ్ళాల్సిందే.
ఇలా చెప్పింది ఎవరో కాదు. రంగస్థలం డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకులు బుర్రలో ఎలాంటి అంచనాలు లేకుండా రావాలి. ఏమీ రాయని తెల్లని కాగితంలా సినిమాకు రండి’’ అని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా నిడివి మూడుగంటలని, ఇది పెద్ద సమస్యే కాదని కూడా చెప్పారు. రంగస్థలం నిడివి 2.50నిమిషాలు ఉంటుందని, ఈ సినిమా చూసిన చిరంజీవి సినిమాపై ఎలాంటి అభ్యంతరం తెలపలేదని అన్నారు. ఇక రంగమ్మత్త క్యారెక్టర్ కోసం చాలా కన్య్పూజ్ అయ్యానని, ఆ పాత్రకి అనుసూయ సెట్ అవుతుందో లేదో అనే డౌట్స్ ఆయనలో కలిగాయని తెలిపారు. కానీ అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ లో ఒదిగిపోయారని కూడా చెప్పారు సుకుమార్.
ఇదిలా ఉండగా…రామ్‌చరణ్, సమంతా జంటగా నటించిన ‘రంగస్థలం’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. 1985 నాటి పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే.