మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం 1985’. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ అంచానాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆనాటికాలం నాటి సెట్ వేయగా అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చేసిన ఈ మూవీ సాంగ్స్ విన్న మంచు మనోజ్ అధికారికంగా ఆడియో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు. ‘‘నా సోదరుడు రామ్ చరణ్ నాకు ‘రంగస్థలం’ పాటలు వినిపించాడు. అప్పట్నుంచి ఆ పాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆడియో.. సినిమా కోసం ఆగలేకపోతున్నా. త్వరగా రిలీజ్ చేయండి’’ అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.
ఇక అంతే.. మెగా అభిమానుల నుంచి మనోజ్ కు సందేశాలు వెల్లువెత్తాయి. పాటల గురించి వివరాలు అడుగుతూ ట్వీట్లు గుప్పించేశారు. ఓ అభిమాని రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని మనోజ్ ను అడిగితే.. ‘బంగారం’ అని బదులిచ్చాడు మంచు వారబ్బాయి.మార్చి 29న ‘రంగస్థలం’ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో ఆడియో విడుదల కావచ్చని సమాచారం.