కూల్చివేతలు ఆగవు..త్వరలో గ్రీవెన్ సెల్: రంగనాథ్

5
- Advertisement -

అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అని చెప్పారు రంగనాథ్. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది… శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కుడా దృష్టి పెట్టాం అన్నారు.

2025 లో జియో ఫెన్సింగ్ సర్వే ఏర్పాటు చేస్తామన్నారు. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం అన్నారు. త్వరలోనే 72 డీఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి… నాగోల్ లో ఉన్న డీఆర్ ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం అన్నారు. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందని… వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రా లో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం… ఎఫ్ టీఎల్ లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు అన్నారు. శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం… 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం అన్నారు. ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుంది… శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుందన్నారు. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం… 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయి అన్నారు.

Also Read:200 ఎకరాల భూమిని రక్షించాం: రంగనాథ్‌

- Advertisement -