రంగమార్తాండలో ప్రకాష్ రాజ్‌ భార్య..!

117
rangamarthanda
- Advertisement -

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘నటసమ్రాట్’ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఒక పాట కూడా చిత్రీకరణ జరుగుతుంది.

ఈ పాటకు సంబంధించి ఓ పోస్ట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు కృష్ణ వంశీ. ప్రకాశం రాజ్ భార్య ఫోటోని షేర్ చేస్తూ.. ”రంగమార్తాండ సినిమాలో అందరూ కనిపించే సాంగ్ కి అద్భుతమైన కొరియోగ్రఫీని ప్రకాష్ రాజ్ భార్య పోనీ ప్రకాష్ రాజ్ అందించారు.” అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -