సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా నేడు రంగం కార్యక్రమం జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి తెలిపింది. ఈ ఏడాది పండుగ చాలా మంచిగా చెశారని చెప్పింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది ఏర్పాట్లు మంచిగా చేశారని తెలిపింది.
ఈసంవత్సరం పూజలు ఎంతో సంతృప్తికరంగా జరిగాయని, గత సంవత్సరం తాను కొంత బాధపడ్డానని, ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొంది. ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరింది.
తన అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా, తనకు దగ్గరగానే ఉండి పూజలు జరిపించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపదలూ రాకుండా చూసుకుంటానని, తనకు మారు బోనాన్ని తప్పకుండా ఇవ్వాలని అమ్మ సూచించింది. ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయని, రైతులకు మంచి పంటలు పండుతాయని, ప్రజల సంతోషమే తన సంతోషమని వెల్లడించింది.