ఆ రేంజ్‌లో ‘రంగం`2’

191
- Advertisement -

‘రంగం’ ఫేమ్‌ జీవా కథానాయకుడిగా నటించిన ‘రంగం-2’ ఈ నెల 25న విడుదలవుతోంది. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో.. శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.యన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె.చంద్రన్‌ దర్శకత్వం వహించారు. ‘రంగం’లో నిన్నటి మేటి కథానాయకి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటించగా.. ‘రంగం-2’లో రాధ చిన్న కుమార్తె తులసీనాయర్‌ జీవాతో జత కట్టింది. ‘రంగం’ చిత్రానికి సంగీత సారథ్యం వహించి, ఆ చిత్రం సాధించిన సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించిన హేరిస్‌ జైరాజ్‌ ‘రంగం`2’ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చడం విశేషం.

ఈ నెల 25న ‘రంగం`2’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా.. ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో చిత్ర నిర్మాత ఎ.యన్‌.బాలాజీ, ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ, ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, సముద్ర, యువ నిర్మాత భరత్‌ చౌదరి, ‘పెళ్ళిచూపులు’ హీరో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు.

భారీ బడ్జెట్‌తో, టాప్‌ టెక్నీషియన్స్‌తో రూపొంద, తమిళంలో మంచి విజయం సాధించిన ‘రంగం`2’ తెలుగులోనూ ఘన విజయం సాధించడం ఖాయమని అతిథులంతా అభిలషించారు. ‘రంగం-2’తో నిర్మాతగా మారుతున్న ఎ.యన్‌.బాలాజీ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని విజయ్‌ దేవరకొండ అన్నారు.

జీవా పెర్ఫార్మెన్న్‌, తుసీనాయర్‌ గ్లామర్‌, హేరిస్‌రాజ్‌ సంగీతం రవి కె చంద్రన్‌ దర్శకత్వం ‘రంగం`2’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని.. గ్లామర్‌ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడేవారిని ‘రంగం-2’ అమితంగా అరిస్తుందని నిర్మాత బాలాజీ తెలిపారు.

ఈ చిత్రానికి మాటలు, పాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, కెమెరా: మనుష్‌ నందన్‌, ఎడిటర్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌, సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, నిర్మాత: ఏ.యన్‌.బాలాజి, దర్శకత్వం: రవి కె. చంద్రన్‌!!

- Advertisement -