‘రంగం-2’ ఫస్ట్ లుక్‌

230
- Advertisement -

జీవా హీరోగా సినిమాటోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రంగం’ ఎంతటి సంచలన విజయం సాధించిందో.. దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్‌ రవి.కె.చంద్రన్‌ దర్శకత్వం వహించిన ‘రంగం-2’ చిత్రం కూడా అంతటి ఘన విజయం సాధించడం ఖాయమని యువ దర్శక సంచలనం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ఫేం కళ్యాణ్‌కృష్ణ అన్నారు.

జీవా-తులసీనాయర్‌ జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో, హ్యారిస్‌ జైరాజ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ‘రంగం-2’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కళ్యాణ్‌కృష్ణ విడుదల చేశారు.రవి.కె.చంద్రన్‌- హ్యారిస్‌ జైరాజ్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ పని చేయగా, తమిళంలో మంచి విజయం సాధించి తెలుగులో ‘రంగం-2’ పేరుతో వస్తున్న ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయం సాధించాలని, నిర్మాతగా ఎ.ఎన్‌.బాలాజీకి (సూపర్‌గుడ్‌ బాలాజీ) మంచి పునాది కావాలని కళ్యాణ్‌కృష్ణ ఆకాంక్షించారు.

Rangam

జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో` శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ ఎన్‌.బాలాజి (సూపర్‌గుడ్‌ బాలాజి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ కార్యక్రమంలో కళ్యాణ్‌కృష్ణతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌ సాయిబాబా, ప్రముఖ నిర్మాత కె.వి.వి.వేణు, ‘రంగం-2’ నిర్మాత ఎ ఎన్‌.బాలాజీ పాల్గొన్నారు.

Jeeva

విడుదల చేసిన మూడు రోజుల్లోనే మూడున్నర లక్షల వ్యూస్‌ రావడం బట్టి ‘రంగం-2’ చిత్రం క్రేజ్‌ అర్ధమవుతుందని కె.వి.వి.వేణు అన్నారు.‘రంగం-2’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం ఎంతో గర్వంగా ఉందని నిర్మాత ఎ ఎన్‌.బాలాజీ (సూపర్‌ గుడ్‌ బాలాజీ) తెలిపారు.

నాజర్‌, జయప్రకాష్‌, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, కెమెరా: మానుష్‌ నందన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌, సమర్పణ: జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, నిర్మాత: ఎ ఎన్‌.బాలాజీ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్‌!!

rangam 2

- Advertisement -