దాణా కుంభకోణం: లాలూకి శిక్ష ఖరారు

198
Ranchi court sentences Lalu Prasad Yadav to 3.5 years in jail, fines him Rs 5 lakh
- Advertisement -

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు శిక్ష ఖరారైంది. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స‌హా 15 మందిని రాంచీలోని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా దోషులంద‌రూ క‌స్ట‌డీలో ఉన్నారు. వారు ప్ర‌స్తుతం బిర్సా మండా సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు.

 Ranchi court sentences Lalu Prasad Yadav to 3.5 years in jail, fines him Rs 5 lakh

జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్డి ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శిక్ష‌కు ఖ‌రారు చేశారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి 3.5 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. మిగతా దోషులకు కూడా ఇదే శిక్షను విధించారు. దియోగర్‌ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు దోషులకు మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం విచారణ చేసింది.

అయితే అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని లాలూ నిన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తికి విజ‍్ఞప్తి చేసిన విషయం విదితమే. మరోవైపు లాలూకు జైలు శిక్షపై ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌ స్పందించారు. చట్టం తన పని తాను చేసిందని, సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసులో దోషుల‌కు ఈ రోజు శిక్ష ఖ‌రారు అయింది.

- Advertisement -