ఆ హీరో…. ఓ వంచకుడు

235
Ranbir Kapoor on Sanjay Dutt biopic
- Advertisement -

రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్ లో సంజయ్ దత్ బయోగ్రఫీ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌చ్ ఎవైటెడ్ మూవీగా రూపొందుత‌న్న ఈ మూవీ లో రణబీర్‌ కపూర్‌.. సంజయ్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు రణ్ బీర్.  ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రణ్‌బిర్  ఓ వంచకుడి జీవితాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపాడు.

Ranbir Kapoor on Sanjay Dutt biopic
‘మేం మహాత్ముడి జీవితాన్ని సినిమాగా రూపొందించడం లేదు. సంజయ్ దత్ జీవితాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆయనను ఎంతోమంది ఇష్టపడతారు, మరెంతో మంది ధ్వేషిస్తారు.. ఒక వంచకుడి జీవితాన్ని సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో మేం నిజాలను నిక్కచ్చిగా చూపించబోతున్నాం. వాస్తవాలను చూపుతూ నిజాయితీగా సినిమాను తెరకెక్కిస్తున్నాం…’ అని రణ్‌బిర్ చెప్పాడు.
సినిమా ప్రతిపాదనతో తాము వెళ్లగా.. ఆయన నిజాయితీగా అన్ని విషయాలను తెలిపాడని…తాము అంతే బాధ్యతతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు.  సంజయ్ తండ్రి పాత్రలో పరేష్‌ రావల్‌  నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మార్చి 2018న మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, విక్క కౌషల్ మరియు మనీషా కోయిరాల ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఇందులో మాధురి దీక్షిత్ ప్రేమాయణం గురించి కూడా చెబుతారని సమాచారం.

- Advertisement -