హీరోయిన్ తాప్సీ పన్నూ బాలీవుడ్ కి పోయాక, మరీ బోల్డ్ గా తయారు అయింది. పైగా తోటి నటీనటుల పై సౌత్ దర్శకనిర్మాతల పై ఆమె విరుచుకు పడుతుంది. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత తాప్సీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తాప్సీ పన్నూ ఘాటు రిప్లై ఇచ్చింది. ‘మీ పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించగా.. ‘నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు. కాబట్టి, అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’ అని తాప్సీ సమాధానమిచ్చింది. దీంతో హీరో రణబీర్ కపూర్ ఫ్యాన్స్ తాప్సీ పన్నూ పై సీరియస్ అవుతున్నారు. రణబీర్ కపూర్ సన్నిహితులు కూడా నేరుగా తాప్సీకు ఫోన్ చేసి, వెంటనే క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు.
నిజానికి తాప్సీ పన్నూ టార్గెట్ రణబీర్ కపూర్ – అలియా భట్ కాదు. హీరోయిన్ ఇలియానా పై సెటైర్స్ వేస్తూ తాప్సీ పన్నూ పై విధంగా కామెంట్స్ చేసింది. గతంలో ఓ ఫంక్షన్ లో ఇలియానాకి – తాప్సీకి మధ్య చిన్నపాటి ఇగో క్లాష్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తాప్సీ నోరు జారింది. ప్రస్తుతం ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. కాబట్టి.. ఆమె క్యారెక్టర్ ను వ్యతిరేకిస్తూ తాప్సీ పన్నూ కామెంట్స్ చేసింది. కాకపోతే, రణబీర్ కపూర్ ద్వారా అలియా భట్ కూడా పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది.
Also Read:ఆ హీరోయిన్ విడాకులు.. నిజమే
కాబట్టి.. తాప్సీ పన్నూ కామెంట్స్ నేరుగా ‘రణబీర్ కపూర్ – అలియా భట్’ దంపతులకు కూడా తగిలాయి. మరి తాప్సీ, రణబీర్ కపూర్ కి ఏం సమాధానం చెబుతుందో చూడాలి. తాప్సీకి సహజంగానే పైత్యం ఎక్కువ. దీనికితోడు ఏరు దాటాక తెప్ప తగలేసే బ్యాచ్ లో తాప్సీాది మొదటి ప్లేస్. బాలీవుడ్ లో సోలోగా కాస్త గుర్తింపు రాగానే గతంలో ఛాన్స్ లు ఇచ్చిన వారినే తాప్సీ చులకనగా మాట్లాడుతోంది. ప్రస్తుతం ఆమె ‘డంకీ’, ‘ఏలియన్’ సినిమాల్లో నటిస్తుంది.
Also Read:ఢిల్లీని వణికిస్తున్న డెంగీ..