5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ రెండు భాగాల లైవ్-ఆక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అందుకున్న VFX స్టూడియో DNEG సంయుక్తంగా, యాష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న రామాయణ, IMAX కోసం చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం పార్ట్ 1 – దీపావళి 2026లో, పార్ట్ 2 – దీపావళి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్‌కు అద్భుత స్పందన రాగా అంతేస్థాయిలో వివాదం ప్రారంభమైంది. ఎందుకంటే రణబీర్ ఓ పాత ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఈ వీడియోలో తాను పెద్ద బీఫ్ తినే వ్యక్తిని అని చెప్పారు. బీఫ్ తింటానని చెప్పిన రణబీర్.. ఇప్పుడు రాముడి పాత్ర చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి దీనిపై రణబీర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Also Read:మరో క్రేజీ ప్రాజెక్టులో పూజా హెగ్డే!

