VD12: విజయ్ కోసం రంగంలోకి రణ్‌బీర్!

15
- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “వీడీ 14”. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

త్వరలో ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీకాగా తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తుండగా ఈ చిత్ర హిందీ టైటిల్ టీజర్‌కు యానిమల్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ టీజర్‌కు రణ్‌బీర్ వాయిస్ ఓవర్‌తో ఇది మరింత వైల్డ్‌గా మారిందని.. ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ ట్రీట్‌గా మారనుందని వారు తెలిపారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందుతోంది.

Also Read:పైరసీ చేస్తే క్రిమనల్ కేసులే!

- Advertisement -