పెళ్లి బంధంతో ఒక్కటైన అలియా-రణ్‌బీర్.. వైరల్‌

101
Ranbir-Alia wedding
- Advertisement -

బాలీవుడ్ ప్రేమజంట అలియా భట్-రణ్‌బీర్ కపూర్ గురువారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఏప్రిల్ 14న కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో వీరి వివాహం కోలాహలంగా ముగిసింది. ఈ నేపథ్యంలో అలియా తమ పెళ్లి పోట్లోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్‌ చేసింది.

ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి మేం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ క్షణం మాకెంతో ప్రత్యేకమైనది అంటూ అలియా చెప్పుకొచ్చింది. ఇక వీరి పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -