వెంకీ.. రానా వెబ్ సీరీస్..!

260
Rana,Venkatesh may Collaborate on a Web series
- Advertisement -

వెంకటేష్, రానా కలయిక కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని పలుమార్లు వార్తలు వినిపించినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్, రానా కలిసి నటించనున్నట్లు తెలిసింది. అయితే అది సినిమాలో మాత్రం కాదు. ఎల్‌టీటీఈ అనే వెబ్‌సిరీస్‌లో వీరిద్దరు కీలక పాత్రలను పోషించనున్నట్లు సమాచారం. దివంగత భారత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులను దృశ్యమానం చేస్తూ కన్నడ దర్శకనిర్మాత ఏ.ఎం. ఆర్. రమేష్ ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు.

Rana,Venkatesh may Collaborate on a Web series

ఇందులో రాజీవ్‌గాంధీ హత్యకేసును చేపట్టిన తమిళనాడుకు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారి డి. ఆర్. కార్తికేయన్ పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నట్లు తెలిసింది. మరో ముఖ్యమైన పాత్రలో రానా నటించనున్నారు. ప్రభాకరన్ నాయకత్వంలో ఎల్‌టీటీఈ విమోచన పోరాటం, అనంతర పరిణామాల్ని ఈ వెబ్‌సిరీస్‌లో చూపించబోతున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారని సమాచారం.

- Advertisement -