హలో ప్రమోషన్స్‌లో భల్లాలదేవ

252
Rana’s Helping Hand for Akhil!
- Advertisement -

హలో  అంటూ ఆడియన్స్ ను పలకరించడానికి అఖిల్ రెడీ అవుతున్నాడు. నాగార్జున నిర్మాణంలో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా టీమ్ లో మరింతగా జోష్ పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Rana’s Helping Hand for Akhil!

అనూప్ సంగీతం అందిస్తున్న 50వ మూవీ కావ‌డం విశేషం. తొలి సినిమా అఖిల్‌తోనే మంచి డ్యాన్సర్ అనిపించుకున్న  అఖిల్ ఈ సినిమాలో స్టెప్పులు ఇరగదీసాడట. ముఖ్యంగా మార్ మారో పాటతో పాటు మెరిసే మెరిసే అంటూ సాగే  సాంగ్స్‌లో అఖిల్ స్టెప్పులు అదిరిపోయాయని చిత్రయూనిట్ చెబుతోంది.

సినిమా విడుదలకు టైం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ చిత్రయూనిట్ బిజగా ఉంది. హలో ప్రమోషన్స్‌  కోసం అఖిల్ యూఎస్ వెళ్లాడు. ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ వివిధ ప్రాంతాల్లో కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రమోషన్స్ లో పాల్గొనడం అఖిల్ కి కొత్త కనుక, ఆయనతో పాటు రానాను కూడా నాగార్జున పంపించారట. అఖిల్ తో పాటు ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో రానా కూడా పాల్గొననున్నాడన్న మాట. యూఎస్ లో రానా కి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే.

- Advertisement -