బాహుబలి తర్వాత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు రానా. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులను డీల్ చేస్తున్న రానా.. నిర్మాతగా మారాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేరాఫ్ కంచరపాలెం అనే సినిమాను నిర్మిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపిన రానా..ఈ పెద్ద చిన్న సినిమాను మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉందని తెలిపాడు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కేరాఫ్ కంచరపాలెం సినిమాను సమర్పిస్తుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమాగా కేరాఫ్ కంచరపాలెం నిలిచిందని తెలిపిన రానా… చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి చిత్రాన్ని సమర్పిస్తుండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్వీకర్ అగస్థి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ‘1945’ అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ చిత్రం తెరకెక్కుతోంది. రెజీనా ఇందులో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. రానా అతిథి పాత్ర పోషించిన హిందీ సినిమా ‘వెల్‌కమ్ టు న్యూయార్క్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
Congratulations to team #COKancharapalem, the first Telugu film to be selected for New York Indian Film Festival @nyindianff ! Proud to be presenting it. pic.twitter.com/jJySRY1kmI
— Rana Daggubati (@RanaDaggubati) April 2, 2018