రానా నాయుడు..టీజర్

62
rana
- Advertisement -

రానా, వెంకటేష్ ఇద్దరూ కలిసి రానా నాయిడు అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తుండగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సిరీస్ టీజర్ ని విడుదల చేసింది. అయితే ప్రస్తుతం హిందీలోనే ఈ టీజర్ రిలీజ్ చేసింది.

ఇక ఈ టీజర్ లో.. రానా, వెంకటేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించినట్టు తెలుస్తుంది. సెలబ్రిటీలకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసే ఓ పర్సన్ గా ఓ నెగిటివ్ రోల్ లో రానా ఇందులో కనిపించబోతున్నారు. వెంకటేష్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఒక వయసు మళ్ళిన పాత్రలో చాలా పవర్ఫుల్ గా చూపించారు. వీరిద్దరూ ఏదో ఒక దాని కోసం పోటీపడబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వెంకటేష్ జైలు నుంచి వచ్చినట్టు, రానాకి తండ్రి క్యారెక్టర్ అయినట్టు చూపించారు. టీజర్ లాస్ట్ లో రానా వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన సీన్ అయితే టీజర్ కి హైలెట్ గా నిలిచింది.

- Advertisement -