థాయ్‌ అడవుల్లో రానా..!

251
Rana Haathi Mere Saathi updates
- Advertisement -

 

బాహుబలి తర్వాత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు రానా. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులను డీల్ చేస్తున్న రానా..బాలీవుడ్ హిట్ హాథీ మేరే సాథీ రిమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతోంది. ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయిన రానా… థాయ్‌లాండ్ జంగిల్ ఐలాండ్ నుంచి హ‌లో చెబుతున్నా… రాబోయే నెల రోజుల పాటు అడ‌వుల్లోనే షూటింగ్‌తో బిజీగా ఉండబోతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

1971లో రాజేష్ ఖన్నా హీరోగా వచ్చిన హాథీ మేరే సాథీ ఒక క్లాసిక్. ఈ సినిమాను తమిళ దర్శకుడు ప్రభు సోలోమాన్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో బన్దేవ్ పాత్రను పోషిస్తున్నాడు రానా. ఏనుగు తొండంపైన కూర్చున్న రానా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో గజరాజు (తమిళంలో కుంకీ) సినిమాను తీసిన ప్రభు.. ఏనుగులు అంటే భలే ప్రాణం ఇచ్చేస్తాడు. అందుకే అతడు రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ సినిమాకు తెలుగులో అడవి రాముడు అనే టైటిల్ ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెరకెక్కుతుండగా ట్రినిటీ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది.దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -