మెరిసిన రాణా,రోహిత్,పోలార్డ్‌.. ముంబై విక్టరీ

187
Rana fifty takes Mumbai to top of table
- Advertisement -

వాంఖడే వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.  177 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబయి తొలి ఓవర్లోనే ఓపెనర్ పార్థివ్ పటేల్ వికెట్ కొల్పోయింది. మరో ఒపెనర్ జోస్ బట్లర్‌కు జత కలిసిన నితీష్‌ రాణా చెలరేగిపోయాడు.  స్పిన్నర్‌ జడేజా వేసిన 8.3 బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా తరలించి అర్ధశతకం పూర్తిచేసిన రాణా(53).. థంపీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే టై బౌలింగ్ లో  కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 11.1 ఓవర్లో మునాఫ్ పటేల్ బౌలింగ్‌లో మెక్‌కల్లమ్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్(26) ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ అండతో పోలార్డ్(39) రెచ్చిపోయాడు. మరో 11 బంతుల్లో 17 పరుగుల చేయాల్సిన తరుణంలో సిక్స్ కొట్టబోయి 160 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుతిరిగాడు. అనంతరం రోహిత్ శర్మ 19.3 ఓవర్లో ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి ముంబైకి విజయాన్నందించాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ లయన్స్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కొల్పోయి 176 పరుగులు చేసింది. లయన్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ (0) రెండో బంతికే వెనుదిరిగాడు. కెప్టెన్‌ సురేశ్‌ రైనా (28; 29 బంతుల్లో 2×4)తో కలిసి మెక్‌కలమ్‌ (64; 44 బంతుల్లో 6×4, 3×6) ఇన్నింగ్స్‌ నిర్మించాడు. మందకొడిగా ఉన్న పిచ్‌పై తొలుత ఆచితూచి ఆడినా మెక్‌కలమ్‌ తర్వాత చెలరేగాడు. ముంబయిపై నాలుగో అర్ధశతకం సాధించాడు. మెక్‌కలమ్‌ అర్ధశతకం బాదిన కొద్దిసేపటికే కెప్టెన్‌ రైనా ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు ఓవర్లకే మెక్‌కలమ్‌ వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (48 నాటౌట్‌; 26 బంతుల్లో 2×3, 2×6) వేగంగా ఆడాడు. ఇషాన్‌ కిషన్‌ (11)తో కలిసి చకాచకా సింగిల్స్‌, డబుల్స్‌ తీశాడు. వీలుచిక్కినప్పుడు బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్‌ను 176/4కు చేర్చాడు. ముంబై ఇండియన్స్ ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

gl MI

point

- Advertisement -