ఒక్క క్లిక్ మీ జీవితాన్ని దెబ్బతీస్తుంది…

241
- Advertisement -

ఈ హీరో తాజాగా సరికొత్త రూపంలో ప్రయోగానికి దిగాడు దగ్గుబాటి రానా. ఇప్పుడు తన కెరీర్‌లో మొదటిసారి ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. మొన్న ‘బాహుబలి’, నిన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలతో తన రేంజ్‌ ని పెంచుకున్న రానా …ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలోకి వెబ్‌సిరీస్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు.
 Watch Social trailer: Rana Daggubati's web series features him as a
తాజాగా రానా న‌టించిన `సోష‌ల్‌` వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ విడుద‌లైంది.  ఈ ట్రైలర్‌ను రానా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ‘ ఒక్క క్లిక్ మీ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఇది నా మొదటి డిజిటల్ షో.. థ్రిల్లింగ్ ట్రైలర్’ అని ట్వీట్ పెట్టారు.

రానా, నవీన్ కస్తూరియా, ప్రియా బెనర్జీ ముఖ్యపాత్రల్లో ‘సోషల్’ అనే వెబ్‌సిరీస్‌ని రూపొందిస్తున్నారు. సోషల్‌మీడియాకు బాగా అట్రాక్ట్ అవుతున్న నేటి యువతపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే కధాంశంతో ఈ వెబ్‌సిరీస్ నిర్మించబడుతోంది.
Rana Daggubati's web series features him as a
ఇక నిజ జీవితంలో జరిగే డిజిటల్‌ మోసాలు, డిజిటల్ క్రైమ్స్ మొదలైన సంఘటనలతో ఈ సిరీస్ ఉంటుందని మేకింగ్‌యూనిట్ తెలిపింది.

ప్రపంచంలోనే సెన్సేషనల్ టెక్ కంపెనీగా పేరొందిన ‘సోషల్’ అనే కంపెనీ సీఈఓ విక్రమ్ సంపత్ పాత్రను రానా పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా సెప్టెంబ‌ర్ 8న ఈ సిరీస్ హిందీ, తెలుగు భాష‌ల్లో వియూ వెబ్ ఛాన‌ల్‌లో ప్రసారం కానుంది.

- Advertisement -