బాహుబలిలో భల్లాలదేవగా నటించి పాపులర్ అయిన రానా …ఇటీవలే సోలో హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన రానా తన తర్వాతి సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.
బాలీవుడ్లో కూడా గుర్తింపు ఉన్న రానాతో సినిమాలు నిర్మించడానికి పలువురు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వెంకటేష్, రానా కలిసి ఓ చిత్రంలో నటిస్తుండగా విలక్షణ నటుడు మోహన్ బాబ్ తెరకెక్కించనున్న పౌరాణిక సినిమా రావణలో కూడా రాణించనున్నట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తుండగా ఆచిత్రంపై మంచు ఫ్యామిలి తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఈ సినిమాను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. పలువురు కోలీవుడ్, బాలీవుడ్ నటులు ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమాతో రానా ఆంజనేయుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే స్టోరి సెలక్షన్ లో కొత్త దనం చూపిస్తూ దూసుకుపోతున్న రానా…. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో బాహుబలి సినిమాతో విలన్ గా జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా పౌరాణిక చిత్రంతోనూ మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.