పాలిటిక్స్‌ అంటేనే డ్రామా:రానా

200
rana
- Advertisement -

రాజకీయాలంటేనే డ్రామా అని ఆ డ్రామా అంటే తనకు ఆసక్తి అని చెప్పారు హీరో రానా. యన్‌టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర పోషించిన రానా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నా జీవితంలో ఇంతవరకూ మరొకరి పాత్ర పోషించలేదు. అలాంటిది చంద్రబాబు పాత్ర పోషించా..ఆయన పాత్రలో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. గత 20 ఏళ్లుగా టీవీ, వార్తల్లో చంద్రబాబును చూస్తున్నా అని సినిమా కోసం ఆయన్ను కలవడం వల్ల సినిమాలో నటించడం సులభం అయిందన్నారు. పాలిటిక్స్‌లో చాలా డ్రామా ఉంటుందని దాన్ని నేను నా సినిమాల్లో ఉపయోగిస్తుంటా అని చెప్పారు. రాజకీయాలంటే తనకు ఆసక్తిలేదని చెప్పారు. రానా ప్రస్తుతం ‘హథీ మేరే సాథీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

యన్‌టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం రానా చాలా కసరత్తులు చేశారు, బరువు తగ్గారు. చంద్రబాబు హావభావాలు ప్రత్యేకంగా తెలుసుకున్నారు. రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

- Advertisement -