- Advertisement -
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు నటుడు దగ్గుబాటి రానా. విచారణలో భాగంగా తాజాగా రానా కూడా హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్,విజయ్ దేవరకొండ. త్వరలో మరికొంతమందిని విచారించనుంది ఈడీ.
Also Read:హంద్రీనీవా..కృష్ణమ్మ పరవళ్లు
- Advertisement -

