వన్ ఇండియా..వన్ సినిమా…రానా ప్రశంసలు

143
rrr
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లను రాబట్టగా ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు హీరో రానా.

వన్ ఇండియా వన్ సినిమా అనేది ఒక వ్యక్తి వచ్చి, ఇది ఇలా ఉంటుంది అని చెప్పే వరకు ఒక కోరిక, కలగా ఉండేది!! కెప్టెన్ మీరు దీన్ని మళ్లీ చేసారు!! రాజమౌళి అండ్ టీంకి మీకు సెల్యూట్ అంటూ రానా ట్వీట్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి అరుదైన ఘనత సాధించిన మూడో భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి 2, దంగల్ ఈ ఫీట్ సాధించిన మొదటి రెండు చిత్రాలు.

- Advertisement -