శివ‌గామిని ఏడిపించిన స‌న్నివేశం ఇదే..!

221
RamyaKrishna Reveals on Baahubali’s Sivagami role
- Advertisement -

బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. రెండు భాగాల్లోను కూడా హీరో, విలన్లతో సమాన స్థాయిలో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రలో రమ్యకృష్ణ జీవించారు. ఆమె తమ సినిమాకు ఓ ఎసెట్ అని స్వయంగా రాజమౌళి కూడా చెప్పుకొచ్చారు.

అయితే, బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు మొదట్లో శ్రీదేవిని తీసుకోవాలనుకున్న రాజమౌళి ఆమె తిరస్కరిండంతో ఆశాభంగం చెందాడు. కానీ ఆ తర్వాత తన తండ్రి విజయేంద్రప్రసాద్ మాటను పాటించి రమ్యకృష్ణను ఎంచుకోవడం బాహుబలి చరిత్రనే మార్చి పడేసింది. భారత చలన చిత్ర చరిత్రలోనే ఇంతటి శక్తివంతమైన మహిళా పాత్ర లేదనేంత రేంజిలో శివగామి పాత్రను రమ్యకృష్ణ దున్ని పడేసింది.

RamyaKrishna Reveals on Baahubali’s Sivagami role

‘ఇది నా మాట.. నా మాటే శాసనం’ అంటూ ఇప్ప‌టివ‌ర‌కు ‘నీలాంబరి’గా ఉన్న త‌న‌పేరును శివ‌గామిగా మారిపోయింది. ఇటీవల విడుదలై రూ.1000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి విజయం పథంలో దూసుకుపోతున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది? అని ఆమెను అడిగితే.. రమ్యకృష్ణ ఇలా చెప్పుకొచ్చారు.

‘నేను పూర్తి సినిమాను (బాహుబలి: ది కన్‌క్లూజన్‌) నేపథ్య సంగీతంతో చూడలేదు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రదర్శనలో తొలిసారి చిత్రాన్ని చూశా. సినిమా చూస్తుండగా కట్టప్ప శివగామి ముందుకు వచ్చి నిజాలు బయటపెట్టినప్పుడు ఏడ్చేశాను. ఆ సన్నివేశం భావోద్వేగంతో ఉండటమే కాదు, సీన్‌ను ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా రాజమౌళి ప్రదర్శించిన తీరు నన్ను కదిలించింది. ఆ సన్నివేశంలో నటించడం చాలా నచ్చింది’ అని రమ్యకృష్ణ అన్నారు.

- Advertisement -