రమ్యకృష్ణ ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, అప్పట్లో రమ్యకృష్ణని కేవలం గ్లామర్ గానే కాదు ఆహ్వానం లాంటి సినిమాల్లో కూడా రమ్య అందానికి దాసోహం అన్నారు. బాహుబాలిలో శివగామి పాత్రతో యవత్ భారతదేశ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోని లేటు వయస్సులో ఎందరో అభిమానులని కూడగట్టుకుంది రమ్యకృష్ణ.
హీరోయిన్ గా ఒక వెలుగుతున్న సమయంలో ‘నరసింహ’ వంటి సినిమాలో రజనీకాంత్ లాంటి హీరోకి దీటైనా పాత్రలో నటించి అప్పట్లోనే అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంది రమ్య. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ ఏపీ మంత్రి పరిటాల సునీత పాత్రలో కనిపించబోతోందని గాసిప్ గుప్పుమంటోంది.
నారా రోహిత్ తాజాగా నటిస్తున్న చిత్రం బాలకృష్ణుడు. ఈ సినిమా స్టోరి రాయలసీమ తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి క్యారెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకుని, అల్లుకున్న స్టోరి. ఈ స్టోరి దాదాపుగా పరిటాల రవి కథలా వుంటుందని తెలుస్తోంది. పరిటాల రవిని కిడ్నాప్ చేస్తే, ఆయన భార్యగా సునీత ఎలా స్పందించి, ఎలా పోరాడారన్నది, అసలు పరిటాల రవి లాంటి క్యారెక్టర్ ను ఎందుకు కిడ్నాప్ చేసారన్నది మరో పాయింట్ అని తెలుస్తోంది. ఈ మూవీలో రమ్యకృష్ణ పరిటాల రవి భార్య పరిటాల సునీత పాత్రలో నటిస్తున్నారు.