సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకి ఆఫర్లు రావాలంటే నిర్మాతల,దర్శకుల రూమ్‌లకు వెళ్ళాల్సిందే. అలా వెళ్తేనే ఆఫర్లతో పాటు క్రేజీ ఆఫర్లు కూడా దక్కుతాయి. ఇలా అన్నది ఎవరో కాదు. ఇటీవలే ఇలాంటి సందర్భాలను మేము కూడా ఎదుర్కున్నాము అంటూ కొంతమంది హీరొయిన్లు సోషల్ మీడియాలో ఓపెన్ గా చెప్పిన మాటలే అవి.
అంతేకాదు తెలుగుసినీ ఇండస్ట్రీలో ఇలాంటి నీచమైన పనులు జరుగుతున్నాయని చాలామంది హీరోయిన్లు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. అలా లొంగకపోతే సినిమా కెరీర్‌కు ఫుల్స్టాప్ పడిపోతుందని కూడా చెప్పారు.
కొంతమంది హీరొయిన్స్ ఇలా ఓపెన్‌గా చెప్పడంతో..టాప్ హీరోయిన్స్కూడా ఆ విషయంపై రియాక్ట్ అయ్యారు. అందులో కొంతమంది ఆ మాటలను అంగీకరించినా..మరికొంతమంది మాత్రం తాము అలాంటి అనుభవాలను ఎదుర్కోలేదని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటీకీ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లుకొడుతూనే ఉన్నాయి.
ఇక ఈ వ్యవహారంపై సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నోరు విప్పేసింది. ఈ వ్యవహారంపై రమ్యకృష్ణ రియాక్ట్ కాస్త బోల్డ్ గానే ఉందని చెప్పాలి. ఇతర రంగాల మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలోనూ అడ్జస్ట్మెంట్ తప్పనిసరి అని చెప్పింది రమ్యకృష్ణ . అంతేకాకుండా అలా అడ్జస్ట్ అయితేనే సినిమా కెరీర్ ఉంటుందని, అప్పుడే హీరోయిన్లు కెరీర్లో ముందుకు వెళతారని కూడా బోల్డ్‌గా చెప్పేసింది రమ్య.
అయితే అడ్జస్ట్ అవడం, కాకపోవడం అనేది వారి వారి వ్యక్తిగత నిర్ణయాలను బట్టి ఉంటుందని కూడా చెప్పింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులకు రమ్యకృష్ణ మాటలపై తెగ డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే..ఇక్కడ రమ్యకృష్ణ ఉపయోగించిన ‘అడ్జస్ట్’ అనే పదానికి అర్థం ఏంటని, ఇతర హీరోయిన్లు చెప్పినట్టుగా సినీ పెద్దలకు లొంగిపోవడమే ‘అడ్జస్ట్’ అనే పదానికి అర్థమా? అంటూ ఫ్యాన్స్ తెగ కన్ఫూజ్ అవుతున్నట్టే తెలుస్తోంది.