బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ

6
ramyajrishna In BiggBoss
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 విజయవంతంగా నడుస్తుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈషోకు రేటింగ్స్ లో కూడా నెంబర్ వన్ స్ధానంలో ఉంది. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం నాగార్జున బిగ్ బాస్ కు వదిలి వెళ్లాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ 3 కొత్త హోస్ట్ గా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చేయనుంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. రాజు దూరంగా ఉన్నప్పుడు రాణి వచ్చిందంటూ రిలీజ్‌ చేసిన ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బాహుబలి చిత్రంలోని పాపులర్‌ డైలాగ్‌ ఇదే నా మాట.. నా మాటే శాసనం అని ఈ ప్రోమోలో రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్‌తో బిగ్‌బాస్‌ నిర్వాహకులు తాజాగా వీడియో విడుదల చేశారు.

శని, ఆదివారం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు, రమ్యకృష్ణల మధ్య ఆసక్తికర సంభాషణలు, గేమ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఇక వచ్చే వారం నుంచి యాధావిధిగా నాగార్జున ఈషోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

- Advertisement -