- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు బిగ్ బాస్ కాంటెస్టెంట్ మరియు రాను ముంబైయ్ కి రాను సాంగ్ ఫేమ్ రాము రాథోడ్.
రాము రాథోడ్ మాట్లాడుతూ మొక్కలు నాటే పవిత్ర కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా చేపట్టాలని మొక్కలు పెట్టడమే కాదు వాటిని రక్షించే బాధ్యత కూడా మన యువతరం మీద ఉంది అన్నారు.
రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్థి మంచి వాతావరణం అని అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

