BB9:కొత్త కెప్టెన్‌గా రాము రాథోడ్

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 26 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం హౌస్‌కి కొత్త కెప్టెన్ అయ్యారు రాము రాథోడ్. తొలుత కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు బిగ్‌బాస్ ఒక టాస్క్ పెట్టాడు. కళ్యాణ్, ఇమ్మూ, రాము, రీతూ.. ఇప్పుడు మీలో ఒక్కరు మాత్రమే బిగ్‌బాస్ సీజన్-9 నాలుగవ కెప్టెన్ అవ్వగలరు.. అది ఎవరో తెలుసుకోవడానికి నేను మీకు ఇస్తున్న టాస్క్ రెయిన్ డ్యాన్స్.. కంటెండర్స్ మీరు ఈ టాస్కులో గెలిచి కెప్టెన్ అవ్వడానికి ఇతర హౌస్‌‌మేట్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.. ప్రతి రౌండ్‌లో బజర్ మోగినప్పుడల్లా కెప్టెన్సీ రేసులో లేని ఇంటి సభ్యులందరూ అక్కడున్న బెల్‌ని రింగ్ చేయడానికి ప్రయత్నించాలి.. ఎవరైతే ముందుగా బెల్ రింగ్ చేస్తారో వారు మ్యూజిక్ ప్లే అయినప్పుడు ప్లేట్‌ఫామ్‌పై నిలబడి డ్యాన్స్ చేయాలి.. చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే రేసు నుంచి ఎలిమినేట్ కాకుండా ఉంటారో ఆ కంటెండర్ నాలుగవ కెప్టెన్ అవుతారు అని చెప్పారు బిగ్ బాస్.

రీతూ వెళ్లి భరణిని సపోర్ట్ అడిగితే లేదు నేను రాముకి సాయం చేస్తానని చెప్పా అని క్లారిటీ ఇచ్చేశాడు. శ్రీజ ఏమో కళ్యాణ్‌కే సపోర్ట్ అని చెప్పేసింది. దీంతో నాకు నీ సపోర్ట్ కావాలి ప్లీజ్.. నేను ఎవరిని అడిగినా వాళ్లు ఏం చెప్పట్లేదు.. భరణి గారు రాముకి సపోర్ట్ చేస్తున్నారు.. శ్రీజ..కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తుంది.. అంటూ డీమాన్‌ని అడిగింది రీతూ. నేను 100 పర్సంట్ అన్నీ గెలవడానికి ట్రై చేస్తా.. అంటూ డీమాన్ మాటిచ్చాడు.

కళ్యాణ్-ఇమ్మూ రేసు నుంచి ఔట్ అవ్వడంతో చివరిగా రాము రాథోడ్, రీతూ చౌదరి మిగిలారు. అయితే ఈసారి గంట.. భరణి చేతికి వెళ్లింది. భరణి ఖచ్చితంగా రాముకే సపోర్ట్ చేస్తాడని తెలిసిన రీతూ.. ఆ టేబుల్‌ని లాగడానికి చాలా ట్రై చేసింది. రాము కూడా గట్టిగానే పట్టు పట్టడంతో ఇద్దరూ చాలా సేపు అలానే కష్టపడ్డారు. ఇక సాంగ్ ఆగగానే రీతూకి సారీ చెప్పి రేసు నుంచి ఎలిమినేట్ చేశాడు భరణి. దీంతో బిగ్‌బాస్ నాలుగో కెప్టెన్ అయిపోయాడు రాము.

Also Read:డిసెంబర్ 5న అఖండ 2: తాండవం!

- Advertisement -