ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

9
- Advertisement -

అనారోగ్యంతో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈనెల 5న ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also Read:Modi:దార్శనికుడు మోడీ 

- Advertisement -