కొండారెడ్డి బురుజు సెట్లో మహేశ్ బాబు

371
Meahesh Babu Sarilerunikevaru
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈసీనిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈమూవీలో మహేశ్ బాబు ఆర్మీ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

అంతేకాకుండా ఈమూవీ టైటిల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. మాజీ ఎంపీ, సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈమూవీలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ఈమూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలీం సిటిలో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్. ఇక్కడ కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను సోమవారం నుంచి తెరకెక్కిస్తున్నారు. ఈవిషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు తెలియజేశారు.

- Advertisement -