రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం,గవర్నర్..

446
kcr
- Advertisement -

రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌,గవర్నర్‌ డా. తమిళిసై సుందర్‌రాజన్‌ ఘన స్వాగతం పలికారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

ఇక రాష్ట్రపతి అక్కడి రాష్ట్రపతి రాజ్‌భవన్‌ చేరుకుంటారు.రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని ద్యానకేంద్రాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. అనంతరం 10.20 నిమిషాలకు తిరిగి బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని, ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంటారు.

ఈ రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -