రామ్ నగర్ బన్నీ…ప్రీ రిలీజ్

6
- Advertisement -

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఫైట్ మాస్టర్ రాము మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాలో చంద్రహాస్ మంచి యాక్షన్ సీక్వెన్సులు చేశాడు. అతనిలో నేర్చుకోవాలనే తపన ఉంది. ఏదైనా స్టంట్ సరిగ్గా రాకుంటే నా వెంటపడి మరీ పర్పెక్ట్ గా వచ్చేవరకు ట్రై చేసేవాడు. చంద్రహాస్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. “రామ్ నగర్ బన్నీ” సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

లిరిక్ రైటర్ అవినాష్ మాట్లాడుతూ – ఓ రియాల్టీ షో సందర్భంగా ప్రభాకర్ గారిని కలిశాను. అప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ పరిచయంతో ఒకరోజు “రామ్ నగర్ బన్నీ” సినిమాకు పాట రాయమని అడిగారు. ఈ మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. సినిమా పెద్ద హిట్ అయి, చంద్రహాస్ కు మంచి పేరు తేవాలి. అన్నారు.

లిరిక్ రైటర్ సాగర్ మాట్లాడుతూ – ముద్దుబిడ్డ సీరియల్ టైమ్ లో ప్రభాకర్ గారు చంద్రహాస్ ను, దివిజను భుజాలపై ఎత్తుకుని వచ్చేవారు. ఈ రోజు చంద్రహాస్ హీరోగా ఎదగడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో మంచి సాంగ్స్ రాసే అవకాశం కలిగినందుకు హ్యాపీగా ఉంది. అన్నారు.

Also Read:గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమా మంచి కంటెంట్ తో వస్తున్నట్లు టీజర్, ట్రైలర్ తో తెలుస్తోంది. చంద్రహాస్ ప్రామిసింగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా చంద్రహాస్ తో పాటు ప్రభాకర్ కు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమా ట్రైలర్ సాంగ్స్ బాగున్నాయి. చంద్రహాస్ ప్రామిసింగ్ గా ఉన్నాడు. ప్రభాకర్ కంటే చంద్రహాస్ ఇంకా ఎక్కువ గుర్తింపు, పేరు తెచ్చుకోవాలి. సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

- Advertisement -