ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను బలపరుస్తూ టీఆర్‌ఎస్ పక్షాన ఆ పార్టీ ఎంపీ జితేందర్‌రెడ్డి నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపే సంతకాల లిస్టులో తొలి సంతకం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేయగా రెండో సంతకం టీఆర్‌ఎస్ ఎంపీ చేశారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిని రేపు ప్రకటిస్తాయని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేసీఆర్‌కు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సూచన మేరకు దళిత నేతనే రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం, అందుకే మీకు ముందుగా ఫోన్ చేస్తున్నాను, మీ పూర్తి మద్దతు కోరుతున్నాను అని మాట్లాడారు. తక్షణమే సీఎం కేసీఆర్ పార్టీ నేతలను సంప్రదించారు. ఒక దళిత నేతకు అవకాశం వచ్చినందుకు ప్రధాని విజ్ఞప్తి మేరకు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఎల్లుండి జరిగే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 30న అర్థరాత్రి పార్లమెంట్‌లో జరిగే జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.