ఎన్టీఆర్‌ పాటకి స్టెప్పేసిన టీడీపీ ఎంపీ….

303
Rammohan Naidu Exclusive Dance Sangith
- Advertisement -

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ద్వితీయ పుత్రిక శ్రావ్యను రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదిక కానుంది.

నిన్న రాత్రి జరిగిన సంగీత్‌లో ఎంపీ రామ్మోహన్ ఎన్టీఆర్  ‘బంతిపూల జానకీ జానకీ…నీ కింత సిగ్గు దేనికీ దేనికి’ అనే పాటకు రెచ్చి పోయి స్టెప్పులేశారు. వీరిద్దరి సంగీత్ కు సంబంధించిన వీడియో యువతను ఆకట్టుకుంటోంది. ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో వారి వివాహ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. 15వ తేదీ తెల్లవారుజామున 03.01 గంటల శుభ ముహూర్తాన వివాహం జరగనుంది.

https://youtu.be/W60aeJjCto4

- Advertisement -