అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటనను సీరియస్ గా తీసుకున్నాం.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. మీడియాతో మాట్లాడిన ఆయన… కేంద్రం హోం కార్యదర్శి అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం అన్నారు.
ఈ కమిటీ 3 నెలల్లో దర్యాప్తు జరిపి కమిటీ నివేదిక ఇస్తుంది అని… నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అన్నారు. విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజులు భారంగా గడిచిందని.. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు ప్రత్యేకంగా తెలుసన్నారు.
బ్లాక్ బాక్స్‌ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని… అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుందని తెలిపారు. బ్లాక్ బాక్స్‌లో ఉన్న సమాచారం రానున్న రోజుల్లో కీలకమని చెప్పుకొచ్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో కమిటీ వేసినట్లు తెలిపారు.
Also Read:రాజాసాబ్..టీజర్ లీక్!

