చిరు..గాడ్‌ఫాదర్‌లో శివగామి!

85
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 153వ సినిమా ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. గాడ్ ఫాద‌ర్ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే ఓ మహిళ పాత్ర చాలా కీలకం కానుందట. దీంతో చాలామందిని ఈ పాత్ర కోసం అనుకున్న చివరకు రమ్యకృష్ణను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిరు చెల్లెలిగా వెండితెరపై మెప్పించడానికి రమ్యకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

ఇక చిరంజీవి ప్రస్తుతం నటించిన ఆచార్య ఫిబ్రవరి 4,2022న ప్రేక్షకుల ముందుకురానుంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ ‘లైగర్’, ’రంగమార్తాండ’, బంగార్రాజు సహా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.

- Advertisement -