- Advertisement -
ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా నేడు ఆయన కొత్త మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘అరవింద సమేత…’ అని టైటిల్ ఖరారు చేశారు. ట్యాగ్ లైన్‌గా ‘వీర రాఘవ’ అని పెట్టారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు.
ఈ ఫస్ట్ లుక్‌పై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. వావ్ వ్.. సిక్స్ ప్యాక్‌లో తారక్… సెక్స్ కన్నా ఎంతో సెక్సీగా ఎప్పడూ చూడనంతగా ఉన్నాడు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ ఆఫీసర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
- Advertisement -