వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తర్వాతి మూవీని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తున్నట్లూ ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్… ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్ స్టార్ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటు ఆర్జీవి, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది బర్రెలు నటిస్తారని తెలిపారు. ఆర్జీవి ఈ సినిమాను ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ట్వీట్టర్ లో రామ్ గోపాల్ వర్మను ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వర్మ ప్రస్తుతం అమృత ప్రణయ్ లవ్ స్టోరీపై సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటివలే ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.