మిషన్ భగీరథ అద్భుతం…

235
mission bhagiratha
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి ప్రశంసలు గుప్పించారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డి పేట సింగూరు జలాశయం వద్ద మిషన్ భగీరథ ఇంటెక్ వెల్స్ నిర్మాణాలను పరిశీలించిన కేంద్రమంత్రి ఎన్నో రోజుల నుంచి ఈ పథకాన్ని చూడాలన్న కోరిక ఇవాళ నెరవేరిందని చెప్పారు.

మిషన్ భగీరథ తరహా పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. అద్భుత పథకాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ అని కొనియాడారు. ఇంటింటికీ మంచినీరు ఇవ్వాలన్న ఆలోచన బాగుందని కితాబిచ్చారు.

కేంద్రప్రభుత్వం నుంచి మిషన్ భగీరథ పథకానికి ప్రత్యేక గ్రాంట్ వచ్చేలా చూస్తానని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఒకేసారి తాగునీరు దేశంలో ఎక్కడ ఇవ్వలేదన్నారు. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

- Advertisement -