ట్వీట్ట‌ర్ ను ప్ర‌శ్నించిన ఉపాస‌న…

279
upasana-konidela
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న నిత్యం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుంది. ట్వీట్ట‌ర్ ద్వారా రామ్ చ‌ర‌ణ్ కు సంబంధించిన ప‌లు పోస్ట్ లు ఫోటోలు పెడుతూ అభిమానుల‌ను ఆనంద పరుస్తుంది. ఇక ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎక్కువ‌గా సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇక తాజాగా ట్వీట్ట‌ర్ లో రామ్ చ‌ర‌ణ్   కు ఓ చేదు అనుభ‌వం ఎదురైంది.

charan, upasana

ఇటివ‌లే రామ్ చ‌ర‌ణ్ ఒక వీడియోను తీసి ట్వీట్ట‌ర్ లో పెట్ట‌గా ఆ వీడియో ప్లే కాక‌పోవ‌డంతో ట్వీట్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌. నిన్న ఎన్టీఆర్ కుమారుడు అభ‌య్ రామ్ పుట్టిన‌రోజు కావ‌డంతో రామ్ చ‌ర‌ణ్ ఓ వీడియో తీసి అభ‌య్ కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపాడు. ఈసంద‌ర్భంగా ఆ వీడియోను రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ట‌ర్ లో పెట్ట‌గా ఆ వీడియో ప్లే కావ‌డం లేదు.

దీంతో ఆ వీడియోను ట్వీట్ట‌ర్ కు షేర్ చేస్తూ ఫిర్యాదు చేశారు ఉపాస‌న‌ . ఇక రామ్ చ‌ర‌ణ్ ఏ వీడియో పెట్టిన చాలా మంది అభిమానులు చూస్తారు కాబ‌ట్టి..ఈవీడియో ప్లేకాక‌పోవ‌డంతో చాలా మంది అభిమానులు నిరాశ‌కు గుర‌య్యారు. ప‌లువ‌రు అభిమానులు ఈవీడియో ప్లే కావ‌డం లేద‌ని రామ్ చ‌ర‌ణ్ కు మెసెజ్ లు చేయ‌గా…అది గ‌మ‌నించిన ఉపాస‌న ఇస్ట్రాగ్రామ్ లోని వీడియోను ట్వీట్ట‌ర్ స‌పోర్ట్ కు పంపించింది.

- Advertisement -