క్లిన్‌కార ఫేస్ రివీల్ చేసిన చరణ్

4
- Advertisement -

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా మెగా ప్రిన్సిస్ క్లిన్ కార కొణిదెల ముఖాన్ని చూడాలని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించారు. క్లిన్ కార పుట్టినరోజు (జూన్ 20) సందర్భంగా ఎట్టకేలకు ఆమె ఫేస్ రివీల్ చేస్తూ ఒక క్యూట్ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన కుటుంబ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన తమ ముద్దుల కుమార్తె క్లిన్ కారను ఎత్తుకుని ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఇప్పటివరకు క్లిన్ కార ఫోటోలను షేర్ చేసినా.. ఎప్పుడూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడిన ఈ జంట, మొదటిసారి పూర్తి ముఖం కనిపించేలా ఫోటోను వదలడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది.

నెటిజన్లు, మెగా అభిమానులు క్లిన్ కార లుక్స్‌పై తెగ కామెంట్లు చేస్తున్నారు. కొందరు అభిమానులు క్లిన్ కార కళ్ళు, నవ్వు అచ్చం మెగాస్టార్ చిరంజీవిలాగే ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోలను పక్కన పెట్టి, అచ్చం తండ్రి పోలికేనని సంబరపడిపోతున్నారు. మా క్లిన్ కార అచ్చం దేవకన్యలా ఉంది.. మెగా ఫ్యామిలీలోకి మరో స్టార్ వచ్చేసింది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Also Read:చిన్న చిన్న పనులే..మెదడుపై!

- Advertisement -