కోర మీసాలతో : చెర్రీ న్యూ లుక్‌!

80
ramcharan
- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌చరణ్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. అక్కడి సెలబ్రిటీలు ఆయన్ని అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోని బాలీవుడ్‌ ప్రముఖ సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్‌ డాబు రత్నానీతో చెర్రి స్పెషల్‌ ఫోట్‌ షూట్‌ చేశారు. దీనికి సంబందించిన ఓ ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ “నీ కష్టం ఫలించాలి. నీ విజయం గర్వించాలి”. అని రాసుకొచ్చారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో ఉన్న ఈ ఫోటోలో చరణ్‌ కోర మీసాలతో ఇంటెన్స్ లుక్‌లో అదర గోట్టేశారు. చెర్రీ లుక్‌ పై ఉపాసన సైతం మనసు పారేసుకున్నారు. లవ్‌ సింబల్స్‌తో తన మదిలోని భావాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫోట్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. రామ్‌ చరణ్‌ తమిళ్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

- Advertisement -